News March 1, 2026

విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

image

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News March 4, 2026

రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

image

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.

News March 4, 2026

విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా ఎలక్ట్రిసిటీ కమిటీ సమావేశం

image

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ చోరీలను అరికట్టాలని, ఆర్‌డీఎస్‌ఎస్ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేసి వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

News March 4, 2026

భూగర్భ విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయండి: విశాఖ ఎంపీ

image

విశాఖలో జరుగుతున్న భూగర్భ విద్యుత్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీ శ్రీ భరత్ విద్యుత్ అధికారులకు సూచించారు. విశాఖ కలెక్టరేట్‌లో‌ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. 11 మండలాల్లో విద్యుత్ సరఫరా పనితీరు, సోలార్ విద్యుత్ వినియోగం, భూగర్భ పనులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్యాంబాబు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.