News March 1, 2026
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం మొత్తం 75,428 మంది శ్రీవారిని దర్శించుకోగా, 36,240 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.56 కోట్లుగా నమోదైంది.
Similar News
News March 7, 2026
ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,900లుగా నమోదైంది. 22 క్యారెట్ బంగారం గ్రాము రూ.14,628, వెండి 10 గ్రాములు రూ.2,736 చొప్పున విక్రయిస్తున్నారు.
News March 7, 2026
సంగారెడ్డి: ‘మోదీ పాలనలో పెరిగిన మహిళలపై వేధింపులు’

కేంద్రంలోని నరేంద్ర మోదీ పాలనలో మహిళలపై వేధింపులు పెరిగాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య విమర్శించారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. సోషలిస్టు పాలనతోనే మహిళలకు భద్రత ఉంటుందని చెప్పారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 7, 2026
హెయిర్ కట్ సరిగా చేయలేదని ₹25లక్షల ఫైన్

హెయిర్ కట్‌లో పొరపాటు భారీ మూల్యం చెల్లించేలా చేసింది. 2018లో ఓ మోడల్ హెయిర్ కట్ కోసం ముంబై ITC హోటల్ సెలూన్‌కు వెళ్లింది. స్టైలిస్ట్ చేసిన వర్క్ ఆమెకు నచ్చలేదు. దీంతో తాను మానసికంగా కుంగి మోడలింగ్, ఇంటర్వ్యూ అవకాశాలు కోల్పోయానని కన్జూమర్ ఫోరంలో కంప్లయింట్ చేసింది. కమిషన్ 2021లో ₹2కోట్ల పరిహారం ప్రకటించగా, ITC సుప్రీంకు వెళ్లింది. దీంతో తీర్పు రివైజ్ చేస్తూ ₹25 లక్షలు ఇవ్వాలని SC ఆదేశించింది.


