News March 1, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో 20 పోస్టులు.. అప్లై చేశారా?

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in
Similar News
News March 2, 2026
హోలీ ఎప్పుడు? రేపా? ఎల్లుండా?

ఈ ఏడాది హోలీ పండుగ నిర్వహణపై గందరగోళం నెలకొంది. మార్చి 3న హోలీ పండుగ, చంద్రగ్రహణం ఒకే రోజు రావడమే దీనికి కారణం. గ్రహణ ప్రభావం ఉన్నందున ప్రధాన వేడుకలను మార్చి 4న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఫాల్గుణ పౌర్ణమి తిథి మార్చి 2వ తేదీన సాయంత్రం 5:55కు ప్రారంభమవుతుంది. మార్చి 3 సాయంత్రం 5:07 గంటల వరకు ఉంటుంది. కాబట్టి సంప్రదాయం ప్రకారం మార్చి 4వ తేదీనే రంగుల హోలీ నిర్వహించుకోవాలి’ అంటున్నారు.
News March 2, 2026
బీర పంటకు నీరు.. ఇలా అందిస్తే మేలు

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
News March 2, 2026
పాక్ ఎయిర్‌బేస్‌పై అఫ్గాన్ దాడి!

పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసినట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. డ్రోన్లతో అటాక్ చేసినట్లు పేర్కొంది. అయితే ఈ దాడిని పాక్ ధ్రువీకరించలేదు. రావల్పిండి సమీపంలోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ పాక్ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ కూడా దీనిపై దాడి చేసింది.


