News May 4, 2024
ఖమ్మం: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)
లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.
Similar News
News November 27, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరుల విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో మంచినీటి సరఫరా బంద్ ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
News November 27, 2024
భద్రాచలాన్ని మండలంగా ప్రకటిస్తూ జీవో జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరొక మండలాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. భద్రాచలం పట్టణాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ను వెలువరించింది. భద్రాచలాన్ని మండలంగా ప్రకటిచడంతో మళ్లీ ఎన్నికల సందడి నెలకొననుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంపీపీ జరిగే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయి.
News November 27, 2024
CM రేవంత్ తో కాన్ఫరెన్స్.. పాల్గొన్న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అటు జిల్లాలో జరుగుతున్న ధాన్యం సేకరణ వివరాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.