News March 1, 2026
పటాన్‌చెరు: జిమ్‌లో లవ్❤︎.. పెళ్లికి నిరాకరణ!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌తో జిమ్‌లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2026
కొమ్మాల జాతర.. అందరి చూపు గిర్నిబావి వైపు!

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాల జాతర అంటే రాజకీయ ప్రభ బండ్లకు పెట్టింది పేరు. జాతర ప్రాంతానికి 3KM దూరంలో ఉన్న దుగ్గొండి మండలం గిర్నిబావి రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనకు కొన్నేళ్లుగా వేదికగా మారింది. WGL-NSPT మెయిన్ రోడ్ కావడంతో పార్టీలు ప్రభలతో బల ప్రదర్శన చేస్తున్నాయి. గిర్నిబావిలో గతేడాది కాంగ్రెస్,BRS మధ్య తోపులాటతో పోలీసుల లాఠీఛార్జ్ వరకు వెళ్లింది. ఈసారి పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
News March 4, 2026
దుబాయ్, ఖతర్‌లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.
News March 4, 2026
కృష్ణా: మందుబాబులారా జాగ్రత్త.. లేబుళ్లు తీసేసి అమ్మేస్తున్నారు!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. బార్లు, వైన్ షాప్స్ నుంచి లేబుళ్లు తొలగించి సరకు విక్రయిస్తున్నారు. లేబుళ్లను తొలగించడం వల్ల అది ఏ డిపో నుంచి వచ్చిందో కనిపెట్టడానికి ఆస్కారం ఉండదు. బెల్టుషాపుల్లో ఇతర రాష్ట్రాల సరకు కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కల్తీ మద్యం అయితే ప్రాణాలకే ముప్పు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఉంది.


