News March 1, 2026

ఇవాళ్టి నుంచి దివ్యాంగులకు బస్సుల్లో ఫ్రీ జర్నీ

image

దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ‘ఇంద్రధనస్సు’ పథకం కింద ఇవాళ్టి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించింది. మహిళలకు అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ తరహాలోనే 40%, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. సదరం సర్టిఫికెట్ లేదా స్మార్ట్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందొచ్చు. ఇతర బస్సుల్లో పాత పద్ధతిలోనే 50% రాయితీ ఉంటుంది.

Similar News

News March 8, 2026

అనంతబాబు భార్యపై నాన్ బెయిలబుల్ వారెంట్

image

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఆమెను ఇటీవల ఈ కేసులో ఏ2గా చేర్చింది. ఈ మేరకు రాజమండ్రి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

News March 8, 2026

రాష్ట్రపతి ఘటన: మమత సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్

image

బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>> పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంతాళీ తెగ సమ్మేళనాన్ని ఉద్దేశపూర్వకంగానే ఆ జనాభా తక్కువ ఉన్న చోట నిర్వహించడం, కనీస ప్రొటోకాల్ పాటించకుండా CM మమతా బెనర్జీ గైర్హాజరు కావడం గిరిజన జాతులను అవమానించడమేనని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారిని రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదని ధ్వజమెత్తారు.

News March 8, 2026

దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

image

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్‌, బెంగాల్‌లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.