News March 1, 2026
ఖమేనీ హతం.. పాలన ఎవరి చేతుల్లో అంటే?

ఇరాన్‌లో కొత్త నాయకుడిని నిర్ణయించే వరకు లీడర్‌షిప్ కౌన్సిల్ పాలన చూసుకుంటుందని ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆ కౌన్సిల్‌లో ప్రెసిడెంట్, న్యాయాధిపతి, గార్డియన్ కౌన్సిల్‌లోని ఓ జ్యూరీ సభ్యుడు ఉంటారని తెలిపింది. సుప్రీం లీడర్ బాధ్యతలు ఈ కౌన్సిల్ తాత్కాలికంగా చూసుకుంటుందని పేర్కొంది. కాగా తదుపరి లీడర్ ఎవరో తనకు తెలుసని, కానీ ఇప్పుడే పేరు బయటపెట్టనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Similar News
News March 1, 2026
ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!

విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న HYDలో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్‌ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్‌కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్‌ను రష్మిక రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
News March 1, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని<
News March 1, 2026
సమయం మారి… సమాచారం లీకై..!

ఇరాన్ సుప్రీం ఖమేనీపై US నెలల తరబడి నిఘా పెట్టి దాడిచేసింది. US నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు గుర్తించినా ఏ భవనంలో అన్నది స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని నిన్న ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


