News March 1, 2026
గద్వాల: కాంగ్రెస్‌లో వర్గపోరు.. తారాస్థాయికి ‘గ్రూపు’ సెగలు!

జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకపోవడంపై కేడర్‌లో అసహనం వ్యక్తమవుతోంది.
Similar News
News March 3, 2026
వాళ్లు నన్ను చంపేస్తారు: ఇరాన్ హీరోయిన్

ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం దిగిపోయేవరకు తాను ఆ దేశంలో అడుగుపెట్టలేనని సాక్రెడ్ గేమ్స్ ఫేమ్, ఇరానియన్ హీరోయిన్ ఎల్నాజ్ నొరౌజీ అన్నారు. ఖమేనీ మృతి విషయం తెలిసి సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఇటీవల ఆమె వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇరాన్ వెళ్తే చంపేస్తారని వ్యాఖ్యానించారు. కాగా ఎనిమిదేళ్ల వయసులో ఆమె ఇరాన్‌ను వీడారు. తర్వాత యూరప్‌లో మోడలింగ్ నేర్చుకున్నారు. ప్రస్తుతం INDలోనే ఉన్నారు.
News March 3, 2026
ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

TG: బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 6 గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. 12 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం రూ.12 లక్షల కోట్ల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రాన్ని BRS, INC అప్పుల కుప్ప చేశారని మండిపడ్డారు.
News March 3, 2026
BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

<


