News March 1, 2026

అభివృద్ధిలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సేవలు అభినందనీయం

image

భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిపాలన ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. 2024 జూలై 16న బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఫిబ్రవరి 26, 2026 వరకు ఆయన జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా నడిపారు. తన పదవీకాలంలో గిరిజన సంక్షేమం, వ్యవసాయం, విద్యా, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా, యువత సాధికారతకు కృషి చేశారు. అభివృద్ధి, రహదారి మౌలిక వసతుల కల్పనలో ఒక విజన్‌తో అద్భుత ఫలితాలను సాధించారు.

Similar News

News March 8, 2026

T20 WC: ‘ఫైనల్’ పంచ్ ఎవరిది?.. జట్టులో మార్పులు ఉంటాయా?

image

T20 WC ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ రా.7 గంటలకు అహ్మదాబాద్ స్టేడియంలో తలపడనున్నాయి. సొంత గడ్డపై WC గెలిచి చరిత్ర సృష్టించాలని ఇండియా, ఈసారైనా కప్ గెలవాలని కివీస్ పట్టుదలతో ఉన్నాయి. అభిషేక్, వరుణ్ స్థానాల్లో రింకూ సింగ్, కుల్దీప్‌ను తీసుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నా మార్పుల్లేకుండానే IND బరిలోకి దిగే అవకాశముంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

News March 8, 2026

మరో స్టార్ హీరోతో నయనతార నయా ప్రాజెక్ట్!

image

ఏజ్ పెరుగుతున్నా నయనతార క్రేజ్ తగ్గట్లేదు. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కి తగ్గట్లు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. షారుఖ్‌ఖాన్‌తో ‘జవాన్’, చిరంజీవితో ‘MSVPG’లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి జంటగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

News March 8, 2026

నిర్మల్: ‘ప్రజాపాలన’లో 341 ఫైళ్ల పరిష్కారం..!

image

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్మల్ జిల్లాలో పారిశుద్ధ్య, ఫైళ్ల పరిష్కార డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏకంగా 48,673 కిలోల ఘన వ్యర్థాలను అధికారులు తొలగించారు. 1,044 ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేశారు. అంతేకాకుండా, పరిపాలనను వేగవంతం చేస్తూ పెండింగ్‌లో ఉన్న 341 ఫైళ్లను ఒకేరోజు పరిష్కరించారు.