News March 1, 2026
మైనారిటీ పథకాలలో ములుగు జిల్లాకు మొండిచేయి!

మైనార్టీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో ములుగు జిల్లాకు మొండిచేయి చూపుతోంది. తాజాగా 90% రాయితీపై ఎలక్ట్రికల్ స్కూటర్లు, టూల్ కిట్లు, జనరేటర్లను అందించేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంది. ఈరోజుతో గడువు ముగిసింది. అయితే, ఆన్‌లైన్ పోర్టల్‌లో ములుగు సహా మొత్తం 8 జిల్లాల పేర్లు లేవు. దీంతో లబ్ధిదారులు ఈ పథకాలకు దూరమయ్యారు.
Similar News
News March 1, 2026
విజయనగరంలో పోలీసుల ర్యాలీ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్‌ను ప్రతీ మహిళ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 1, 2026
పెరిగిన జీఎస్టీ వసూళ్లు

AP: రాష్ట్రంలో గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ వసూలు గతంలో కన్నా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం GST-2.0లో పలు వస్తువులపై ట్యాక్సుల భారాన్ని తగ్గించినా రాబడిలో పురోగతి నమోదైంది. 2026 FEBలో నెట్ వసూలు ₹3061 CR కాగా గ్రాస్ ₹3562 CRవసూలు అయ్యింది. అదే 2025 FEBలో నెట్ ₹2902CR కాగా గ్రాస్ ₹3569CRగా ఉంది. సెస్‌తో సంబంధం లేకుండా గ్రాస్ వసూళ్లు తగ్గినా నెట్ వసూళ్లలో మాత్రం ₹150 CR పెరుగుదల కనిపించింది.
News March 1, 2026
పసుపు రంగు రాసిన చికెన్ విక్రయిస్తే చర్యలు: బ్రహ్మాజీ

చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణితో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


