News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.
Similar News
News March 1, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని<
News March 1, 2026
సమయం మారి… సమాచారం లీకై..!

ఇరాన్ సుప్రీం ఖమేనీపై US నెలల తరబడి నిఘా పెట్టి దాడిచేసింది. US నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా దృష్టి పెట్టింది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు గుర్తించినా ఏ భవనంలో అన్నది స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని నిన్న ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
News March 1, 2026
ఇరాన్‌కు UAE ప్రెసిడెంట్ వార్నింగ్

‘మీ యుద్ధం పొరుగుదేశాలతో కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ ఇరాన్‌ను UAE ప్రెసిడెంట్ మహ్మద్ బిన్ జాయెద్ హెచ్చరించారు. పొరుగు దేశాలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. UAEలోని పలు ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడులు గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ను దూరం చేశాయన్నారు. US, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైనా ఇరాన్ దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే.


