News March 1, 2026
హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

<
Similar News
News March 1, 2026
మిడిల్ ఈస్ట్ దేశాలు.. వాటి ప్రాముఖ్యం ఇదే!

మిడిల్ ఈస్ట్‌లో సౌదీ అరేబియా, Iran, ఈజిప్ట్, తుర్కియే, Iraq, ఇజ్రాయెల్, జోర్డాన్, సిరియా, లెబనాన్, Yemen, ఒమన్, UAE, కువైట్, బహ్రెయిన్, ఖతర్, పాలస్తీనా, సైప్రస్ దేశాలున్నాయి. ఇస్లాం, క్రైస్తవం, యూదు మతాల జన్మస్థలాలు, పురాతన నాగరికతలు (మెసొపొటేమియా, ఈజిప్టు) ఇక్కడే పుట్టాయి. ప్రపంచంలోని ఆయిల్&నేచురల్ గ్యాస్ నిల్వలలో అతిపెద్ద భాగం(48-50%) ఇక్కడే ఉన్నాయి. అలాగే వాణిజ్య గేట్‌వేగా పిలువబడుతున్నాయి.
News March 1, 2026
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అరాఫీ

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా సీనియర్ మతాధికారి అయతుల్లా అరాఫీ వ్యవహరించనున్నట్లు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నిన్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. కాగా అరాఫీ ప్రస్తుతం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ డిప్యూటీ ఛైర్మన్‌గా, ఇరాన్ సెమినరీ సిస్టమ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు.
News March 1, 2026
ఆర్టీసీ డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలా? మంత్రి క్లారిటీ

TG: RTC డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలన్న ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ‘RTC నియామకాలకు RTCకి ఎలాంటి సంబంధం ఉండదు. ఆర్టీసీ నియామకాలు పోలీసు రిక్రూట్‌మెంట్ సెల్ పరిధిలో చేపడతారు. డ్రైవర్ పోస్టుకు 6 అడుగుల ఎత్తు ఉండాలనేది తప్పుడు ప్రచారం. MV యాక్ట్ ప్రకారం 5.3అడుగులు(160cm) ప్రామాణికం. రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే లీగల్ చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.


