News March 1, 2026
వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 20, 2026
రెండో దశ చర్చలకు ఇరాన్ నో: IRNA

అమెరికాతో రేపు రెండో <<19692220>>విడత<<>> చర్చలకు ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ ఖండించినట్లు ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ IRNA వెల్లడించింది. US షరతులు ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇరాన్ పోర్టులను యూఎస్ నేవీ దిగ్బంధించడాన్ని సీజ్‌ఫైర్ ఉల్లంఘనగా పేర్కొన్నట్లు వివరించింది.

తిరుపతి: విద్యుత్ సరఫరా ఆపి.. ఆక్రమణకు యత్నం..

తిరుపతి రూరల్ మంగళం క్వార్టర్స్‌లో కొనుగోలు చేసిన ఇంటిపై కోర్టు వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీకి చెందిన ఓ నేత అండదండలతో 17వ తేదీన ఇంటికి కరెంట్ కట్ చేసి కబ్జాకు యత్నించినట్లు తెలుస్తోంది. TDP నేత నుంచి తమను రక్షించాలని దేవళ్ల లక్ష్మి అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ నాయకులు విద్యుత్ సరఫరాను ఆపి కబ్జా చేయడానికి ప్రయత్నించడం స్థానిక ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.