News March 1, 2026

ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

image

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.

Similar News

News March 2, 2026

ఆసియా మార్కెట్లపై వార్ ఎఫెక్ట్

image

గల్ఫ్ వార్ ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్, కొరియా మార్కెట్లు డౌన్ అయ్యాయి. హార్ముజ్ జలసంధి నుంచి ఓడల రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర 13% పెరిగింది. ఇవాళ భారత స్టాక్ మార్కెట్లలో కూడా బ్లడ్ బాత్ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. ఇవాళ మరోసారి పెరుగుదల తప్పేలా లేదు.

News March 2, 2026

దుబాయ్‌లో హీరోలు చిక్కుకున్నారనే వార్తలు.. ఫ్యాన్స్ ఆందోళన

image

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేళ తమిళ హీరోలు అజిత్, మాధవన్ దుబాయ్‌లో చిక్కుకున్నట్లు వార్తలు రాగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై అజిత్ టీమ్ స్పందిస్తూ ఆయన క్షేమంగా ఉన్నారంది. మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు దుబాయ్ వెళ్లిన అజిత్ నిన్న తిరిగి రావాల్సి ఉంది. మాధవన్ స్పందిస్తూ తాను ఫ్యామిలీతో USలో ఉన్నట్లు చెప్పారు. మంచు విష్ణు, సోనాల్ చౌహాన్, PV సింధు తదితరులు దుబాయ్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

News March 2, 2026

T20WC: టీమ్ఇండియా చెత్త ఫీల్డింగ్

image

భారత జట్టు సెమీస్‌కు చేరినా ఫీల్డింగ్ కలవరపెడుతోంది. నిన్న WIతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లోనూ 3 క్యాచులు వదిలేసింది. ఈ WCలో ఇప్పటి వరకు 13 క్యాచులను నేలపాలు(71.7% ఎఫిషియెన్సీ) చేసింది. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక(11) ఉంది. నిన్న మ్యాచ్ విన్ కావడంతో దీనిపై పెద్దగా చర్చ జరగలేదని క్రీడావర్గాలు అంటున్నాయి. రానున్న మ్యాచుల్లో ఇదే కంటిన్యూ అయితే వరల్డ్ కప్ సాధించాలనే ఆశలు వదులుకోవాల్సిందే అని చెబుతున్నారు.