News May 4, 2024
వచ్చే వారం రైతులకు నష్ట పరిహారం!
TG: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చేవారం నుంచి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ సేకరించిన రైతుల వివరాల ఆధారంగా రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈసీ అనుమతితో ఫండ్స్ రిలీజ్‌కు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 27, 2024
నా పిల్లలకు మన్మోహన్ స్కాలర్‌షిప్ ఇస్తానన్నారు: మలేషియా ప్రధాని
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం నెమరేసుకున్నారు. ‘గతంలో నేను జైలుకు వెళ్లినప్పుడు సింగ్ అండగా నిలిచారు. మలేషియా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, నా పిల్లల చదువు కోసం స్కాలర్‌షిప్ చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన ప్రతిపాదనను నేను సున్నితంగా తిరస్కరించా’ అంటూ సింగ్ మరణవార్త తెలిసి Xలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
News December 27, 2024
కాలువలో పడిన బస్సు.. 8 మంది మృతి
పంజాబ్‌లోని బఠిండాలో ఓ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. స్థానిక MLA జగ్పూర్ సింగ్ గిల్ తెలిపిన వివరాల మేరకు వంతెనపై రెయిలింగ్‌ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన తెలిపారు. 18 మంది ప్రయాణికులు షాహిద్ భాయ్ మణిసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 27, 2024
All Time Low @ రూపాయి కన్నీళ్లు!
డాలర్‌తో పోలిస్తే రూపాయి సరికొత్త జీవితకాల కనిష్ఠానికి చేరుకుంది. చివరి రెండేళ్లలోనే ఒకరోజు అతిఘోర పతనం చవి చూసింది. వరుసగా ఏడో ఏడాదీ నష్టాలబాట పట్టింది. నేడు 85.31 వద్ద ఓపెనైన రూపాయి 85.82 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. ఆర్బీఐ జోక్యంతో కాస్త పుంజుకొని 85.52 వద్ద ముగిసింది. భారత ఎకానమీ గ్రోత్ తగ్గడం, ఇన్‌ఫ్లేషన్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, FIIలు వెళ్లిపోవడమే పతనానికి కారణాలు.