News March 1, 2026
మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత.. PM మోదీ కీలక భేటీ

ప్రధాని మోదీ కాసేపట్లో ఢిల్లీలో క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS)తో మీటింగ్ నిర్వహించనున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్-US యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితులు, గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల రాజస్థాన్, తమిళనాడు పర్యటన అనంతరం PM మోదీ కొద్దిసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. కాగా CCS దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
Similar News
News March 4, 2026
పంచాయతీల్లో ‘పంచాయితీ’!

TG: 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల్లో చిచ్చు పెట్టాయి. ప్రతి ఊరికి రూ.6లక్షలు జమ కాగా వీటిని పాత బిల్లుల చెల్లింపులకూ వాడాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గతంలో తాము ఖర్చు చేసిన బకాయిలు చెల్లించాలని పాత సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిధులను కొత్త పనులకే వెచ్చిస్తామని నూతనంగా ఎన్నికైన సర్పంచులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో నిత్యం గొడవలే జరుగుతున్నాయి.
News March 4, 2026
2వేల టార్గెట్లను ధ్వంసం చేశాం: US మిలిటరీ

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్‌లోని 2వేల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఆ దేశ నేవీకి చెందిన ఒక సబ్‌మెరైన్ సహా 17 యుద్ధనౌకలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఒక్క ఇరాన్ షిప్పు కూడా లేదని తెలిపింది. మరోవైపు నేవీతో పాటు ఇరాన్ మిస్సైల్ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బ తీసేలా అమెరికా దాడులు చేస్తోంది.
News March 4, 2026
దుబాయ్, ఖతర్‌లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.


