News March 1, 2026
HNK: మావోయిస్టు లొంగుబాటు

జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా ఆయుధాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన లొంగుబాటుతో స్థానికంగా హర్షాతిరేకాలు వెలువెత్తాయి.
Similar News
News March 4, 2026
యూరియా ఉత్పత్తి తగ్గుదల.. పెరగనున్న రేట్లు?

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఖతర్‌లో LNG <<19281702>>ఉత్పత్తి<<>> నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ప్రొడక్షన్‌ను కంపెనీలు తగ్గిస్తున్నాయి. యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్‌స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్‌గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలోనూ కీలకమైన ఇన్‌పుట్. యూరియా కొరత ఏర్పడితే రేట్లు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
News March 4, 2026
BNGR: హాస్టళ్లలో ఇక ‘ఫేషియల్’ హాజరు..! .

జిల్లాలోని 85 సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇకపై Facial Recognition (FRS) ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. SC, ST, BC, మైనార్టీ, కేజీబీవీల్లో పారదర్శకత కోసమే ఈ నిర్ణయమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.
News March 4, 2026
ఫిన్+టిమ్= అదిరెన్.. T20WCలో సరికొత్త చరిత్ర

T20WC-2026లో కివీస్ ఓపెనర్లు <<19299520>>ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్<<>> రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ఈ ఎడిషన్‌లో 10.93 రన్ రేట్‌తో 463 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. T20WC హిస్టరీలో పరుగులు, రన్ రేట్ పరంగా ఇవే అత్యధికం. 2024లో ఇబ్రహీం-గుర్బాజ్ 7.6 RRతో 446 రన్స్, 2021లో బాబర్-రిజ్వాన్ 7.33 RRతో 411 పరుగులు, 2022లో బట్లర్-హేల్స్ 9.2 RRతో 368 రన్స్, 2007లో గిల్‌క్రిస్ట్-హెడెన్ 8.93 RRతో 335 పరుగులు చేశారు.


