News March 1, 2026

ఆసుత్రికి చేరుకున్న నెల్లూరు ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ ప్రసూతి విభాగంలో ఆదివారం రాత్రి ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం ఏర్పడటంతో జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెంటనే స్పందించారు. ఆమె నెల్లూరు ప్రసూతి విభాగానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్సీతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

Similar News

News March 6, 2026

‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటూ నెల్లూరు జిల్లాలో అవగాహన

image

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.

News March 6, 2026

వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బ్యాంకర్లకు సూచించారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఆయన నిర్వహించారు. ఖర్చులు తగ్గి వ్యవసాయం మరింత సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రోన్‌లు వంటి పరికరాల కొనుగోలుకు అన్ని బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు.

News March 6, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

image

రెవెన్యూ అధికారులందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మ్యూటేషన్లు, రీ-సర్వే, 22ఏ వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు