News March 2, 2026

VZM: పశు మాంసం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

image

ఎస్.కోట మండలం గోపాలపల్లి SC కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్ అనే వ్యక్తులను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని CI నారాయణమూర్తి తెలిపారు.

Similar News

News March 4, 2026

‘ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి’

image

జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రకటించిన 99 రోజుల కార్యాచరణను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

News March 4, 2026

ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

image

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.

News March 4, 2026

జాతీయ క్రికెట్‌లో కానిస్టేబుల్ సాయి సత్తా.. ఎస్పీ సన్మానం

image

జాతీయ స్థాయి క్రికెట్ క్రీడాకారుడు, కానిస్టేబుల్ సాయి కుమార్‌ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్‌లో సాయి అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్‌కు చేర్చారు. క్రీడల్లో రాణిస్తూ పోలీస్ శాఖకు పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.