News March 2, 2026
తల్లాడ: ఈ స్టూడెంట్ బ్రిలియంట్

రంగం బంజరకు చెందిన ధర్మసోత్ మోక్షిత్ నాయక్ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్‌లో నాలుగు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి నేషనల్ టాపర్‌గా నిలిచాడు. 50 మార్కులకు గాను 47 మార్కులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. గిరిజన విద్యార్థి సాధించిన ఈ ఘనతపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ మోక్షిత్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Similar News
News March 3, 2026
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.
News March 3, 2026
ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్ జీవన్ మిషన్’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.
News March 3, 2026
ఖమ్మం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన డ్రాయింగ్ హయ్యర్, లోయర్ అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నంబర్ నమోదు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.


