News March 2, 2026

మంథని: “సర్పంచ్ నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు”

image

మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు మార్చి 2, 1935న ఉమ్మడి KNR (ప్రస్తుత భూపాలపల్లి జిల్లా) ధన్వాడ గ్రామంలో జన్మించారు. 1964-83 మధ్య ధన్వాడ సర్పంచ్‌గా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని MLAగా గెలిచారు. ఉమ్మడి AP శాసనసభకు 11వ స్పీకర్‌గా(1991–1995) సేవలకు గుర్తిస్తూ HYD ట్యాంక్ బండ్ పై శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Similar News

News March 2, 2026

ADB: PVTGల గుర్తింపు ప్రమాణాలు ఇలా.!

image

ఆదివాసీ తెగలలో అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలను గుర్తించేందుకు కేంద్రం 4, 5 ప్రణాళికలో PVTG అనే ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. 18 రాష్ట్రాలు, అండమాన్–నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 75 PVTGలు ఉన్నాయి. ధేబర్ కమిషన్ సూచించిన ప్రమాణాలను బట్టి ఆయా వర్గాల సాంకేతిక స్థాయి, తగ్గుతున్న లేదా స్థిరమైన జనాభా, తక్కువ అక్షరాస్యత, జీవనాధార స్థాయి, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా PVTGలను నిర్ణయిస్తారు.

News March 2, 2026

కామారెడ్డి: లీగల్ ఎయిడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

image

సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన బాధితులకు తిరిగి నగదు పొందెందుకు తక్షణ సహాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర వెల్లడించారు. బాధితులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 లేదా సమీప పోలీస్ స్టేషన్, లేదా జిల్లా సైబర్ క్రైమ్ సెల్‌ను సంప్రదించాలన్నారు.

News March 2, 2026

సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం: వరంగల్ సీపీ

image

సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. హోలీ అనంతరం యువత స్నానాల కోసం శివారు ప్రాంతాల్లోని చెరువులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని సీపీ పేర్కొన్నారు.