News March 2, 2026

అన్నమయ్య: కరెంట్ సమస్యలు ఉంటే కాల్ చేయండి!

image

అన్నమయ్య జిల్లాలో చాలా మంది లోవోల్టేజ్, ఎక్కువ కరెంట్ ఛార్జీలు, మీటర్ల నూతన కనెక్షన్లు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి పరిష్కారానికి APSPDCL సీఎండీ శివశంకర్ ఆధ్వర్యంలో డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. వినియోగదారులు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు 89777 16661 నంబర్‌కు కాల్ చేసి సమస్యలను చెప్పవచ్చు. వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటారు.

Similar News

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.

News March 3, 2026

రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

వెల్దండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి ఆర్టీసీ డ్రైవర్ వంకుడావత్ గణేశ్ (32) దుర్మరణం చెందారు. బైక్‌ను డీసీఏం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేశ్ మృతితో ఒంటి గుడిసె తాండలో విషాదం నెలకొంది.

News March 3, 2026

అనుమతి లేకుండా నియామకాలు వద్దు: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టొద్దని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో, ఆసుపత్రి సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియామక ప్రక్రియకు సంబంధించి ముందస్తు నోటిఫికేషన్లు ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట ఏరియా ఆసుపత్రి సహా రీజనల్ ఐ హాస్పిటళ్లలో త్వరలోనే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.