News March 2, 2026
B-2 బాంబర్: ఆకాశంలో అజేయ మృత్యుపాశం!

ప్రపంచ గగనతల చరిత్రలో ఒక అద్భుతం B-2 Spirit Stealth Bomber. రాడార్లకే దొరకని దీని ‘స్టెల్త్’ టెక్నాలజీ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. సుమారు 20 టన్నుల అణు లేదా సంప్రదాయ ఆయుధాలను మోస్తూ 50,000 అడుగుల ఎత్తు నుంచి మృత్యువులా విరుచుకుపడుతుంది. ఒక్కసారి ఇంధనం నింపితే 9,600km ప్రయాణించి ప్రపంచంలో ఏ మూలనైనా నిశ్శబ్దంగా ధ్వంసం చేయగలదు. అమెరికా గగనతల ఆధిపత్యానికి ఇదే కీలకం.
Similar News
News March 4, 2026
అరకు రానున్న వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం 10.50 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అరకు బయలుదేరుతారు. అక్కడ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో రాణా ప్రతాప్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ నివాసానికి వెళ్లి, ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు, కోడలిని ఆశీర్వదిస్తారు.
News March 4, 2026
ఆయిల్ టెన్షన్ అక్కర్లేదు.. 8 వారాల నిల్వలు

ఇరాన్ ఉద్రిక్తతలు నెలల తరబడి కొనసాగొచ్చని విశ్లేషణలు వస్తున్నా భారత్‌లో చమురు సంక్షోభం తలెత్తే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన వద్ద 8వారాలకు సరిపడా నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. హార్ముజ్ జలసంధి నుంచి వచ్చే చమురు 40% మాత్రమే కాగా.. ప్రత్యామ్నాయంగా క్రూడాయిల్ అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. అటు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.
News March 4, 2026
7,948 MTS, హవల్దార్ పోస్టులు.. పరీక్ష ప్రైమరీ కీ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 MTS, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు నిర్వహించిన (CBIC & CBN) పరీక్ష ప్రైమరీ కీ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్‌షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే రూ.50 చెల్లించి, మార్చి 6 వరకు తెలుపవచ్చు. వెబ్‌సైట్: https://ssc.gov.in


