News May 4, 2024
136 MLA, 21 MP స్థానాల్లో కూటమి విజయం: పృథ్వీరాజ్

వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తథ్యమని ప.గో. జిల్లా ఉండి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యే మంతెన రామరాజు, సినీనటుడు పృథ్వీరాజ్‌లతో కలిసి పాలకోడేరు, కొండేపూడి, వేండ్ర, గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు 136 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తారన్నారు. కూటమి మ్యానిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు.
Similar News
News March 27, 2026
ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు: ప.గో జేసీ

రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) మోదుగగుంటలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ధాన్యం సేకరణకు రెండు కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. సంచుల నాణ్యతను రైతులు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News March 27, 2026
మహిళల భద్రత కోసం శక్తి యాప్: కలెక్టర్

భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని “పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013”నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను ఉపయోగించాలన్నారు. స్వయంగా మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సేవల పనితీరును పరిశీలించారు.