News March 2, 2026
కొండగట్టు ఈవోగా వేములవాడ ఈవోకి అదనపు బాధ్యతలు

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేములవాడ రాజన్న ఆలయ ఈవో ఎల్ రమాదేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈవోగా పనిచేసిన శ్రీకాంత్ రావుకు మన్యంకొండకు బదిలీ కావడం.. ఆ వెంటనే ఆయన సెలవుపై వెళ్లడంతో వేములవాడ ఈవో రమాదేవికి కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News March 3, 2026
రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.
News March 3, 2026
SRCL: అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులను 3 రోజుల్లోగా ప్రారంభించాలని కలెక్టర్ గరీమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్ శాఖ పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా మహిళా సంఘ భవనాలను పూర్తి చేయాలని, తుది దశలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News March 3, 2026
ప్రభుత్వాసుపత్రిలో సమయపాలన పాటించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలోనీ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, డాక్టర్లు సమయపాలన పాటించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ డా.సత్య శారద హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, సూపరిండెంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.


