News March 2, 2026
మార్కెట్ల బ్లడ్‌బాత్.. రూ.8లక్షల కోట్లు ఆవిరి

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్‌బాత్ కొనసాగుతోంది. సెన్సెక్స్ 1498, నిఫ్టీ 455 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపడుతుండటంతో రూ.8లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు 6శాతం, ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 5శాతం కోల్పోయాయి. డిఫెన్స్ షేర్లు పుంజుకున్నాయి.
Similar News
News April 8, 2026
ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే 50% టారిఫ్: ట్రంప్

ఇరాన్‌తో సీజ్‌ఫైర్ కొనసాగుతున్న వేళ ఇతర దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్స్ విధిస్తానని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News April 8, 2026
టెన్త్, ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందిగ్ధం నెలకొంది. అయితే APలో ఈ నెల 3వ వారంలో ఇంటర్, నెలాఖరున టెన్త్ రిజల్ట్స్ వస్తాయని సమాచారం. TGలో ఈ నెల 10లేదా12వ తేదీ అని ప్రచారం జరిగినా 15-20వ తేదీ లోపు ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సుంది. అటు టెన్త్ పరీక్షలు ఇంకా ముగియలేదు. పూర్తైన పేపర్ల వాల్యుయేషన్ జరుగుతుండటంతో ఈ నెలాఖరుకే ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.
News April 8, 2026
చిన్న పొరపాటు.. పెద్ద సీటుకు గండి!

నామినేషన్‌లో <<19598336>>అభ్యర్థుల<<>> పొరపాటుతో విజయ్ TVK ముఖ్యమైన స్థానంలో పోటీచేసే ఛాన్స్ కోల్పోయింది. గుర్తింపు లేని పార్టీ అభ్యర్థికి నామినేషన్‌లో మద్దతుగా కనీసం 10 సంతకాలు ఉండాలి. ఎడప్పాడిలో TVK అది మిస్ చేసి సీటుకే ఎసరు తెచ్చుకుంది. TN మాజీ సీఎం, AIADMK చీఫ్ పళనిస్వామి పోటీ చేస్తున్న ఈ చోట రాణించుంటే TVKకి రాజకీయంగా కలిసొచ్చేది. దీంతో మొత్తం 234 సీట్లు కాగా ఇప్పుడు 233 చోట్ల పోటీ చేయనుంది. <<-se>>#Elections2026<<>>


