News March 2, 2026
సత్యసాయి జిల్లా జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. నియమావళి ప్రకారం అర్హులందరికీ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. తొలి విడతలో 435 కార్డులు అందజేస్తున్నామని, మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సమాచారశాఖ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 4, 2026
మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!

TG: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువత కోసం ప్రభుత్వం మే 18 – 23 మధ్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. హెల్త్ అవేర్‌నెస్ కోసం 18న మండల స్థాయిలో 5కే మారథాన్, 2కే వాకథాన్, యోగా తరగతులు నిర్వహిస్తారు. 19న ఉద్యోగావకాశాలపై అవగాహన, 20న జిల్లా స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. 21న ఆటల పోటీలు, 22న స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 23న 50 మందితో యూత్ పార్లమెంట్ నిర్వహించనుంది.
News March 4, 2026
టాప్ సెల్లింగ్ కార్‌గా డిజైర్!

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్‌లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.


