News March 2, 2026

వనపర్తి: సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేయండి: కలెక్టర్

image

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలలను జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News March 20, 2026

ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులు

image

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని(EHS) ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు 421 ఎంప్యానెల్ ప్రైవేటు హాస్పిటల్స్‌లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తామన్నారు.

News March 20, 2026

నల్గొండ: ఇరుకైన బ్రిడ్జిలు.. ఘోర ప్రమాదాలు

image

కోదాడ-జడ్చర్ల, నల్గొండ-మాచర్ల హైవేలపై ఇరుకైన వంతెనలు, రక్షణ గోడలు లేకపోవడంతో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల హాలియా సమీపంలో జరిగిన లారీ ప్రమాదంలో కొత్తగూడెం దంపతులు మృతి చెందగా, కంపాసాగర్ వద్ద కారు కాల్వలో పడి మరో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. అధికారులు స్పందించి వంతెనలకు రక్షణ గోడలు నిర్మించి, ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News March 20, 2026

ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.