News March 2, 2026

NRPT: ప్రజావాణిలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి

image

ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Similar News

News March 2, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

image

రాయనపాడు యార్డ్ పనుల వల్ల మే 1 నుండి 5 వరకు పలు రైళ్లు రద్దయ్యాయి. రైలు నంబర్లు 12861/62 (విశాఖ-మహబూబ్‌నగర్), 20809/10 (సంబల్‌పూర్-నాందేడ్), 20811/12 (విశాఖ-నాందేడ్) పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అలాగే 18519/20 ఎక్స్‌ప్రెస్ గుంటూరు మీదుగా, 12803 స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ మీదుగా దారి మళ్లించబడతాయని వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులు గమనించగలరు

News March 2, 2026

నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలి: CM CBN

image

AP: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశమివ్వాలని CM CBN ఆదేశాలు జారీ చేశారు. RTGS, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై సమీక్షించిన ఆయన, ఈ నెల నుంచి పబ్లిక్ పర్సెప్షన్‌ 80-90%కి తగ్గకుండా ఉండాలన్నారు. ‘అన్ని బస్ స్టేషన్లలో టాయిలెట్ల మరమ్మతులు పూర్తి చేయాలి. పెన్షన్ల పంపిణీ, ‘దీపం’ సిలిండర్ల డెలివరీ, స్వర్ణ గ్రామాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని ఆఫీసర్లకు సూచించారు.

News March 2, 2026

రామగుండం రైల్వేస్టేషన్‌కు కొత్త కళ

image

రామగుండం రైల్వేస్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. అమృత్ భారత్ కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన వివిధ పనులు 100 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ భవనం ఆధునీకరణ, బుకింగ్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఆధునిక టాయిలెట్ బ్లాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు, ర్యాంపు, ఎస్కలేటర్లు, ఏటీఎం, రిటైనింగ్ రూమ్, సైన్ బోర్డులు, ఫర్నిచర్ తదితర పనులు పూర్తయ్యాయి.