News May 4, 2024

నేడు హిందూపురానికి సీఎం జగన్

image

సీఎం జగన్ ఇవాళ హిందూపురంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు హిందూపురం టీడీపీ కంచుకోటగా మారింది. ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్ పర్యటన హిందూపురంలో ఏ మాత్రం ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Similar News

News March 12, 2026

రూ.20 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు

image

అనంతపురం నగరపాలక సంస్థ విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సొంతంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తెలిపారు. ఏటా రూ.10 కోట్ల వ్యయాన్ని ఆదా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విన్నపం మేరకు సీఎం చంద్రబాబు ఈ ప్లాంట్ కు సహకారం అందించారు.

News March 11, 2026

అనంతపురం జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంట వెంటనే వినియోగదారులు ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదన్నారు. సింగిల్ సిలిండర్ 21 రోజులు, డబుల్ సిలిండర్ 30 రోజుల వ్యవధి అన్నారు.

News March 11, 2026

1,245 మంది బాలికలకు HPV వ్యాక్సిన్ వేషం

image

క్యాన్సర్ నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని PHC, పట్టణ, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులలో జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జ్ అధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,649 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించామన్నారు. అందులో నేడు 1,245 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ అనంతరం వైద్యులు అమ్మాయిలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారన్నారు.