News March 2, 2026
కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.
Similar News
News March 3, 2026
విశాఖ: బర్త్‌డే.. డెత్ డే

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు <<19282896>>మృతి చెందిన<<>> విషయం తెలిసిందే. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై ధర్మేందర్ తెలిపారు.
News March 3, 2026
విశాఖ: కోస్టల్ కారిడార్‌పై మల్లగుల్లాలు..

భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు VMRDA ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష జరిగింది. ఎయిర్‌పోర్ట్ అనుసంధాన మార్గాలు, విశాఖ పోర్టు నుంచి విమానాశ్రయం వరకు కొస్టల్ కారిడార్ ప్రతిపాదనపై MPలు, MLAలు, విశాఖ, విజయనగరం కలెక్టర్లు చర్చించారు. అమలుపై ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు, సూచనలు చేశారు. భూసేకరణ, మార్గ రూపకల్పన అంశాల్లో స్పష్టత అవసరమని అభిప్రాయపడినట్టు తెలిసింది.
News March 2, 2026
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు


