News March 2, 2026
పోలవరం జిల్లాలో టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్

పోలవరం జిల్లాలో 10వ తరగతి ఆపై చదివిన వారికీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని ప్రిన్సిపల్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఈ కామర్స్ డెలివరీ విభాగం, కస్టమర్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కొక్క విభాగంలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 19లోగా అప్లై చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 3, 2026
మైలవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మైలవరానికి చెందిన అబ్దుల్ మానేన్ (29) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కారులో చెన్నై వెళుతుండగా మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు(M) తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి పై నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు చేతుకొచ్చిన కొడుకు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు.
News March 3, 2026
విజయవాడ: యువతకు మంచి అవకాశం.. 3 నెలల ఫ్రీ ట్రైనింగ్

SRR & CVR ప్రభుత్వ కళాశాలలోని స్కిల్ హబ్‌లో అప్లికేషన్ డెవలపర్(వెబ్ & మొబైల్) కోర్సులో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్కిల్ అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. 20 నుంచి 35 ఏళ్లలోపు వయస్సున్న డిప్లొమా/బీటెక్/డిగ్రీ /పీజీ/ అభ్యర్థులు ఈ శిక్షణలో చేరవచ్చని, ప్రవేశాలకై మార్చి 5లోపు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకై కళాశాలలోని స్కిల్ హబ్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.
News March 3, 2026
TGNPDCL పరిధిలో రికార్డు విద్యుత్ డిమాండ్

తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో మంగళవారం 6,441 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైంది. సోమవారం నమోదైన 6,273 మెగావాట్ల రికార్డును అధిగమించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. డిమాండ్ పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని, వేసవిని ఎదుర్కొనేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు.


