News March 2, 2026

ఉత్తమ ఫలితాలకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్

image

ములుగు జిల్లాలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల కోసం సమగ్ర కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. రోజువారీ, వారాంత పరీక్షలతో సన్నద్ధం చేయాలని, తల్లిదండ్రులతో సమన్వయం పెంచాలని తెలిపారు. విద్యార్థులకు విజయపథ సందేశ లేఖలు అందజేశారు. అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 4, 2026

GNT: జగన్‌పై మాటల దాడి చేసిన అచ్చెన్నాయుడు

image

మాజీ సీఎం జగన్ క్రైస్తవుడు కాబట్టే దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం శాసన మండలిలో జగన్ పై తనదైన శైలిలో మంత్రి అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. జీసెస్ ఫోటో సాక్షిలో తప్పుగా ప్రచురించినందుకు క్రైస్తవ సోదరులకు శతకోటి క్షమాపణలు చెప్పిన జగన్, TTD లడ్డును కల్తీ చేసిన విషయంలో క్షమాపణ చెప్పకపోగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

News March 4, 2026

జాన్సెన్ దూకుడు.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: NZతో జరుగుతున్న సెమీఫైనల్లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేశారు. మార్క్రమ్ 18, డికాక్ 10, బ్రెవిస్ 34, మిల్లర్ 6, స్టబ్స్ 29 రన్స్ చేశారు. రచిన్ రవీంద్ర, మెక్‌కొంచి, హెన్రీ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 30 బంతుల్లోనే 55* రన్స్ చేశారు. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో విరుచుకుపడ్డారు.

News March 4, 2026

బాపట్ల: ‘క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలి’

image

బాపట్లలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల కొరతతో బాలికల పాఠశాల విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఆరా తీశారు. నిలిచిపోయిన అదనపు గదుల నిర్మాణాలపై విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో చర్చించారు. మౌలిక సదుపాయాలు కల్పించి గదులను ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన ప్రాక్టికల్స్ నిర్వహించాలని సూచించారు.