News May 4, 2024

BHPL: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. ఎస్సై శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రిత రెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం తన స్నేహితురాలి వద్దకు వచ్చి, తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో జేఎన్టీయూ సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.

Similar News

News January 9, 2026

మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

image

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

News January 9, 2026

వరంగల్: 5 కొత్త లేఅవుట్లకు అనుమతి

image

కొత్త లేఅవుట్ల ఏర్పాటుకు జిల్లా లేఅవుట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఐదు లేఅవుట్లకు తుది అనుమతులు మంజూరు చేశారు. పైడిపల్లి, దేశాయిపేట, స్తంభంపల్లి, నక్కలపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న లేఅవుట్లను పరిశీలించి ఆమోదం తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు

News January 9, 2026

వరంగల్ జిల్లాలో సరిపడా యూరియా ఉంది: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని యాసంగి 2025- 26 పంటల సాగుకు సరిపడా యూరియా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ యాసంగి పంటకు 19770 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 9770 మెట్రిక్ టన్నుల జనవరి మాసంలో రైతులకు అవసరం మేరకు అందించడం జరుగుతుందన్నారు.