News May 4, 2024

కడప: బాలికల పాఠశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప నగరం చిన్నచౌక్‌లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పి.విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు అర్హులైన బాలికలు తమ దరఖాస్తులను చిన్నచౌక్ లోని గురుకుల పాఠశాలలో అందచేయాలని ఆమె తెలిపారు. వివరాలకు 9440687844, 8555074045 నంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.

Similar News

News March 11, 2026

YVU కాన్వకేషన్.. డౌట్స్ ఉంటే స్కానర్ క్లిక్ చేయండి.!

image

YVUలో ఈ నెల 13న జరగనున్న కాన్వకేషన్‌లో పట్టాలందుకొనే విద్యార్థుల సౌకర్యార్థం ఎంక్వయిరీ నెంబర్ (9703216198)ను ఏర్పాటు చేసినట్లు CE ప్రొ.కె.ఎస్.వి కృష్ణారావు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం YVU నుంచి, కడప ఆర్టీసీ, పాత బస్టాండ్, ఇర్కాన్ సర్కిల్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. వాలంటీర్లు సేవలందిస్తారన్నారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే కాన్వకేషన్ జరిగే ప్లేస్ తెలుస్తుందని పేర్కొన్నారు.

News March 11, 2026

కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

image

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.