News May 4, 2024
సికింద్రాబాద్-బరంపురం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా బరంపురం ప్రాంతానికి ఈనెల 11,14 తేదీల్లో, తిరిగి 12,15 తేదీల్లో 07035 నంబరు గల వేసవి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.శాందీప్ వివరాలు వెల్లడించారు. ఈనెల 11,14 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బరంపురం చేరుకుంటుందని తెలిపారు.
Similar News
News July 9, 2025
రేపు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ డ్రైవ్

శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, ఇంటెల్లిరేస్ సీఈఓ ఆర్. నరేంద్ర మంగళవారం తెలిపారు. ఈ మేళాలో పాల్గొనే వారు డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, బి.టెక్ విద్యార్హత ఉండాలన్నారు. 28 ఏళ్ల లోపు ఉన్న యువతి, యువకులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న యువత సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.
News July 9, 2025
ప్రతి ఉద్యోగి అయిదుగురుకైన ఆహ్వానం పలకాలి: జిల్లా కలెక్టర్

జూలై 10న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ప్రతి ఉద్యోగి కనీసం ఐదు మంది తల్లిదండ్రులకైనా ఆహ్వానం పలికేందుకు ఇళ్లవద్దకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో, ఇతర అధికారులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు కోసం అరపూట సమయం వెచ్చించాలని, సమావేశాలకు భారీగా తరలి రావాలని ఆయన కోరారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు వేళాయె..!

సింహాచలం గిరి ప్రదిక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి రథం కదలనుంది. 32 కిలోమీటర్ల మేర సాగనున్న ప్రదక్షిణలో సుమారు 5 లక్షలకు పైనే భక్తులు వస్తారని అధికారులు అంచానా వేశారు. తొలిపావంచా నుంచి మొదలయ్యే ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, MVPకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, NAD జంక్షన్, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోనుంది.