News May 4, 2024

విజయవాడ రైల్వే డివిజన్‌కు రూ.7.96కోట్ల ఆదాయం

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్‌కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.

Similar News

News March 16, 2026

కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

image

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News March 16, 2026

అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.

News March 16, 2026

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు: డీఈవో

image

మచిలీపట్నంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను డీఈవో యు.వి. సుబ్బారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిలకలపూడి సీపీఎం హైస్కూల్, నిర్మల, హైని, శ్రీ బాలాజీ, ఎంఈకే బాలాభాను తదితర పాఠశాలల్లో పరీక్షల సరళిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన వసతులను సమీక్షించిన ఆయన, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పరీక్షలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.