News March 3, 2026
ఖమ్మం: ఆ తండాలో 3 రోజులు హోలీ సంబరాలు

కూసుమంచి మండలం లోక్యతండా గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడ జరగని విధంగా 3 రోజుల పాటు జరిగే హోలీ వేడుకల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం కోలాటం కార్యక్రమం ప్రారంభం కానుంది. కుల పెద్దలు డప్పు కొట్టి హోలీని ప్రారంభిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువకులు, బంజారాలు ఈ కోలాటంలో పాల్గొంటారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ఉట్టి పడే విధంగా హోలీ వేడుకలు ఉంటాయి.
Similar News
News March 4, 2026
మంచి మనుసు చాటుకున్న అల్లు అర్జున్!

టాలీవుడ్ సీనియర్ నటి పావలా <<18529362>>శ్యామల<<>>, ఆమె కుమార్తె ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని ఓ ఫౌండేషన్‌లో ఉంటున్నారు. వీరి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మానవత్వంతో స్పందించారు. వారి వైద్య & నిత్యావసర ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.10 వేలు అందేలా ఏర్పాటు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇబ్బందుల్లో ఉన్న నటికి బన్ని చేసిన సాయంపై ప్రశంసలొస్తున్నాయి.
News March 4, 2026
గర్భిణుల్లో రక్తహీనతకు కారణం ఇదే!

కట్టెలు, పిడకలు మండించి వంట చేయడం వల్ల కలిగే వాయు కాలుష్యం ఇండియాలోని గర్భిణులలో రక్తహీనత ముప్పును 43% పెంచుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘దీనివల్ల వెలువడే విషవాయువులు రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేద మహిళలు దీని బారిన పడుతున్నారు. రక్తహీనతను తగ్గించి తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడాలంటే స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడటం అత్యవసరం’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News March 4, 2026
పార్వతీపురం: ఇంటర్ పరీక్షకు 229 మంది గైర్హాజరు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షకు 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. జనరల్ విద్యార్ధులు 4161 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2567 మందికి గానూ 128 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 6,728 మంది విద్యార్థులకు 229 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు.


