News March 3, 2026
సిరిసిల్ల: జిల్లా ఎస్పీని కలిసిన వేములవాడ డీఎస్పీ

వేములవాడ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు జిల్లా ఎస్పీ మహేష్ బి గితేను మర్యాదపూర్వకంగా కలిసారు. మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయనకు సూచించారు.
Similar News
News March 4, 2026
NGKL: ఇంటర్ విద్యార్థిని ప్రసవం.. నిందితుడిపై పోక్సో కేసు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న బాలిక ప్రసవం ఘటనలో నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వనపర్తి జిల్లాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడితో సదరు విద్యార్థినికి పరిచయం ఉందని, ఆ చనువుతోనే ఆమె గర్భం దాల్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా ఈ కేసు విచారణను చేపట్టారు.
News March 4, 2026
44 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News March 4, 2026
NGKL: కేజీబీవీ విద్యార్థిని ప్రసవం.. బాబు క్షేమం..!

నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించిన KGBV విద్యార్థిని ప్రసవం ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలోనే నిందితుడు ప్రేమ పేరుతో బాలికను బుట్టలో వేసుకున్నట్లు తేలింది. బాధ్యులను రక్షించేందుకు విద్యాశాఖలో కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రసవించిన బాలిక సుమారు 2 కిలోల బరువున్న బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారు.


