News March 3, 2026

నాగర్‌కర్నూల్ జిల్లాకు 1772 హెచ్‌పీవీ టీకాలు

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాక్సిన్ స్టోర్‌కు 1,772 హెచ్‌పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 4, 2026

వేములవాడ: నేడే అసలైన హోలీ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.

News March 4, 2026

ఆయిల్ ధరలు భారీగా తగ్గొచ్చు: ట్రంప్

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక గతంలో కంటే కూడా తగ్గుతాయని భావిస్తున్నాని చెప్పారు. ఇరాన్‌పై ఇప్పుడు దాడి చేయకపోతే అణుయుద్ధం వచ్చేదన్నారు. కాగా ఇరాన్‌‌పై దాడుల్లో సహకరించని స్పెయిన్‌తో ట్రేడ్ రద్దు చేసుకుంటామన్న ట్రంప్ యూకేపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 4, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 4)

image

* 1886: స్వాతంత్ర్య సమరయోధుడు బులుసు సాంబమూర్తి జననం
* 1973: తెలుగు సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం
* 1964: తెలుగు, కన్నడ కవి కిరికెర రెడ్డి భీమరావు మరణం
* 2002: ఒడిశా, బెంగాల్, త్రిపుర మాజీ గవర్నర్ కె.వి.రఘనాథరెడ్డి మరణం (ఫొటోలో కుడివైపు)
* 2016: లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా మరణం
* జాతీయ భద్రతా దినోత్సవం
* ప్రపంచ ఊబకాయ దినోత్సవం