News May 4, 2024
తాడేపల్లి బైపాస్‌లో డ్రగ్స్ కలకలం

తాడేపల్లి బైపాస్‌లో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్స్‌ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ కలిగి ఉన్న విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 4, 2026
గుంటూరు జిల్లాలో 5 రేషన్ దుకాణాలపై కేసులు

గుంటూరు జిల్లాలో 5 చౌకధరల దుకాణాల పై కేసులు నమోదు చేసినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 244 రేషన్ షాపులను తనిఖీ చేశామని, తనిఖీల్లో సరుకులో వ్యత్యాశం గుర్తించి పెదకాకాని మండలంలో 3, ఫిరంగిపురంలో 1, నల్లచెరువులో 1 షాపు పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. కార్డుదారుల నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్న 4 వాహనాలను పట్టుకున్నామన్నారు.
News March 4, 2026
పెదకాకానిలో విషాదం.. నాలుగేళ్ల బాలిక మృతి

పెదకాకాని మండల కేంద్రానికి చెందిన శిరీషా (4) బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శిరీషా ఆడుకుంటూ బూరను మింగింది. ఊపిరి ఆడక అస్వస్థతకు గురవడంతో గుంటూరు GGHకు తరలించారు. చికిత్స అందించినప్పటికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
News March 3, 2026
మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

వన్యప్రాణి సంహారాన్ని నివారించి, కో-లివింగ్ వైపు మలచడమే హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. వన్యప్రాణుల వల్ల పంట, ప్రాణ నష్టం జరగకుండా ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రత్యేక వాహనాలను ప్రారంభించిన పవన్.. అటవీ శాఖ చరిత్రలో ఇది కీలక రోజని అభివర్ణించారు.


