News March 3, 2026

గండికోటలో వైష్ణవి హత్య.. మరో అప్డేట్.!

image

గండికోటలో <<17074128>>జూలై- 14- 2025<<>>లో వైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు జమ్మలమడుగు అర్బన్ CI నరేశ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలను కోర్టు ఉత్తర్వులతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గుజరాత్‌లో అనుమానిత ముద్దాయిపై బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష చేయించినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 15-20 రోజులు సమయం పడుతుందన్నారు.

Similar News

News April 17, 2026

కుప్పం కోర్టు ఉత్వర్వును సస్పెండ్ చేసిన హైకోర్టు

image

YCP ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, గిరిధర్‌రెడ్డికి హైకోర్టులో <<19667603>>ఎదరుదెబ్బ<<>> తగిలింది. CM చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో వీరి రిమాండ్‌ను తోసిపుచ్చుతూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.

News April 17, 2026

నెల్లూరులో అమ్మాయిల పేరుతో మోసం

image

నెల్లూరు నగరంలోని ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పేరుతో ఉన్న ఫేక్ ఐడి నుంచి మెసేజ్‌తోపాటు, కాల్ చేయగా అవతలి వ్యక్తి ఏడుస్తూ అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలాంటి భావోద్వేగపూరితమైన మాటలతో మాయ చేస్తూ నగదు కాజేసే సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. మీకు తెలిసిన వారు ఎవరైనా SM వేదికగా డబ్బులు అడిగితే పంపకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

News April 17, 2026

‘అక్షయ తృతీయ’ ఏ రోజున చేసుకోవాలి?

image

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. ఏటా వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి రోజు దీన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ తిథి ఏప్రిల్ 19న 10.49AMకు మొదలై మరుసటి రోజు 7.27AMకు ముగుస్తుంది. అందువల్ల 19వ తేదీనే పండుగ జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజున 10.49AM-12.20PM మధ్య పూజకు మంచి సమయమని పేర్కొంటున్నారు.