News March 3, 2026
యాదాద్రి: మహిళ ఆత్మహత్య..!

కడుపు నొప్పి భరించలేక మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం దివాలాపూర్ గ్రామంలో జరిగింది. SI అశోక్ వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వలసకూలీ దుర్పాటి బాయి.. భర్త, కుటుంబీకులతో కలిసి 3 ఏళ్ల క్రితం కూలీ పని నిమిత్తం గ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో 3 రోజులుగా కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమె నొప్పి భరించలేక ఇవాళ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News March 7, 2026
మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.
News March 7, 2026
వార్‌కు వారం!

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించి నేటికి వారం రోజులు పూర్తయింది. గత శనివారం (FEB 28) ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో US, రోరింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. మొదటి రోజే సుప్రీంలీడర్ ఖమేనీ హతం కాగా ఇరాన్ ప్రతీకార దాడులతో యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలకు వ్యాపించింది. ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా చనిపోగా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో 217 మంది ప్రాణాలు కోల్పోయారు.


