News May 4, 2024
MLC ఉప ఎన్నికకు 7 నామినేషన్లు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండోరోజు నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు దాఖలైన నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. ఈ నెల 9వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువుంది.
Similar News
News March 25, 2026
పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News March 24, 2026
అంగన్వాడీల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ అనుదీప్ అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లల హాజరు తక్కువగా ఉండటంపై కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని, సామ్, మ్యామ్ పిల్లలకు ఆర్‌బీఎస్‌కే వైద్యులతో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పోషకాహారం, సౌకర్యాలు మెరుగుపరచి హాజరు పెంచాలని అధికారులకు సూచించారు.