News May 4, 2024

నిప్పుల కొలిమిలా నంద్యాల జిల్లా

image

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత మరింత అధికమైంది. గత ఏడాది వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకే ఉన్నాయి. మొదటిసారి నంద్యాల జిల్లాలోని మూడు మండలాల్లో శుక్రవారం దాదాపు 48 డిగ్రీలకు చేరువ కావడం గమనార్హం. బండిఆత్మకూరు, గోస్పాడులో 47.7 డిగ్రీలు, నందికొట్కూరులో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News March 6, 2026

మహిళలను సన్మానించండి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.

News March 5, 2026

కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

image

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

News March 5, 2026

కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.