News May 4, 2024
ఘోరం: బాత్రూమ్‌లో బిడ్డను కని.. రోడ్డు మీదకు విసిరేసింది!

ఆమె ఓ ఎంబీఏ విద్యార్థిని. పెళ్లి కాకుండానే తల్లైంది. తాజాగా బాత్రూమ్‌లో జన్మనిచ్చింది. ఆ రహస్యాన్ని దాచాలన్న భయం, ఆమెలోని మాతృహృదయాన్ని మరుగుపరిచింది. బిడ్డను ఓ పార్సిల్ కవర్‌లో పెట్టి అమానుషంగా రోడ్డుమీదకు విసిరేసింది. అటుగా వెళ్తున్నవారు రోడ్డుపై మృత శిశువును గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. కవర్‌పై ఉన్న చిరునామా నిందితురాలిని పట్టించింది. కేరళలోని కొచ్చిన్‌లో ఈ దారుణం జరిగింది.
Similar News
News March 22, 2026
రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.
News March 22, 2026
UAEపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. అసలు ప్లాన్ ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు UAEని మంటల్లోకి నెట్టింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న $5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం (27%) UAE నుంచే వచ్చాయి. అందుకే ఆ దేశంపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ పెట్టుబడుల హబ్‌గా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాలపై నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ వ్యూహం.
News March 22, 2026
నేడు సిద్దిపేట పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న ‘రైతు ఉత్సవాలు’ ముగింపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ సందర్భంగా సుమారు ₹300 కోట్లతో నిర్మించిన TG ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోనే మొదటి ఆయిల్ రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారు. ఇదే వేదికగా రైతు భరోసా మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.


