News May 4, 2024

రణస్థలం: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థితో నారా రోహిత్ భేటీ

image

ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నివాసానికి సినీ హిరో నారా రోహిత్ శనివారం ఉదయం విచ్చేశారు. ఆయనకు నియోజకవర్గ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావుతో నియోజకవర్గంలో కూటమి బలోపేతానికి తీసుకున్న చర్యలు, పార్టీకి వస్తున్న ఆదరణను రోహిత్‌కు వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయమే గెలుపుగా అందరూ కృషి చేయాలని కోరారు.

Similar News

News November 6, 2025

SKLM: ఈ నెల 11న ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

శ్రీకాకుళం జిల్లాలోని సివిల్ సర్వీసెస్ ప్రభుత్వ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) కోసం జిల్లా స్థాయి క్రీడా ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేశ్ బాబు బుధవారం తెలిపారు. నవంబర్‌ 11న కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్‌ కాలేజీలో మొత్తం 19 క్రీడాంశాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేస్తారన్నారు.ఉద్యోగులు తమ డిపార్ట్‌మెంట్ గుర్తింపు కార్డుతో స్టేడియం వద్ద హాజరుకావాలన్నారు.

News November 5, 2025

SKLM: జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

image

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ మందిరంలో జల్ జీవన్ మిషన్‌పై ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంనకు సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డిఈ కలెక్టర్‌కు వివరించారు.

News November 5, 2025

శ్రీకాకుళం: ‘ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం’

image

జిల్లాను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం ZP సమావేశ మందిరంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్షలో అయన పాల్గొన్నారు. వ్యవసాయం, ఉపాధి కల్పన,పరిశ్రమలు,పారిశుద్ధ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో చర్చించవలసిన అంశాలపై ప్రతి 3నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా MLAలు పాల్గొన్నారు.