News March 4, 2026
అమలాపురం: నిద్రమత్తు వదిలిస్తున్న పోలీసులు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు SP రాహుల్ మీనా ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున ‘స్టాప్, వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహించారు. నిద్రమత్తులో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హైవేలపై వాహనాలను నిలిపి డ్రైవర్ల ముఖాలు కడిగించి, వారికి అవగాహన కల్పించారు. అర్ధరాత్రి వేళల్లో ప్రయాణించే డ్రైవర్ల అప్రమత్తత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News March 8, 2026
ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.
News March 8, 2026
పాలమూరు: అంతుచిక్కని వ్యాధితో వేల సంఖ్యలో కోళ్ల మృతి

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని చెన్నపురావుపల్లిలో కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధి ప్రబలడంతో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. పౌల్ట్రీ రంగానికి భారీ నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో తీరని ఆర్థిక నష్టం వాటిల్లిందని, చనిపోయిన కోళ్లను గుంతలు తీసి పాతిపెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 8, 2026
తిరుపతి: మహిళా రైల్వే స్టేషన్ గురించి తెలుసా…!

అవును ఇది దక్షిణ భారతదేశంలోనే ఏకైకా మహిళా రైల్వే స్టేషన్ గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చంద్రగిరి రైల్వే స్టేషన్. స్టేషన్ మాస్టర్ నుంచి ఆర్పీఎఫ్ సిబ్బంది, గార్డులు ఇలా అన్ని విభాగాల్లో రాత్రి, పగలు మహిళలే విధులు నిర్వహిస్తుంటారు. 2018 నుంచి ఇప్పటివరకు మహిళలే నడిపిస్తున్న మహిళా రైల్వే స్టేషన్‌గా కీర్తి గడించింది.


