News May 4, 2024

ఎల్లుండి నుంచి వర్షాలు

image

TG: ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Similar News

News December 31, 2024

పుట్టిన రోజున వారసుడిని ప్రకటించనున్న దలైలామా?

image

ఆధ్యాత్మిక గురువు దలైలామా జూలై 6న 90వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన వారసుడిని ప్రకటిస్తారన్న ప్రచారం నడుస్తోంది. చైనాపై నిరసన తెలిపేందుకు ఆ ప్రకటన ఆయనకున్న అవకాశమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. దలైలామా తర్వాతి స్థానంలో ఉండే పాంచెన్ లామాను చైనా ఇప్పటికే ఖైదు చేసింది. వారసుడిని ప్రకటనకు వారిద్దరూ ఉండాల్సిన అవసరం ఉండటంతో లామా ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

News December 31, 2024

ఇస్రోకి చంద్రబాబు అభినందనలు

image

PSLV-60 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు AP CM చంద్రబాబు ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘మరో మైలురాయిని దాటిన ఇస్రోకు అభినందనలు. ఆర్బిటల్ డాకింగ్‌లో భారత సామర్థ్యాన్ని మరింత పెంచేలా స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. మనుషుల రోదసి ప్రయాణానికి, ఉపగ్రహాలు మరమ్మతులకు ఇది చాలా కీలకం. ఈ విజయంతో చంద్రయాన్-4, స్పేస్ స్టేషన్ వంటి కీలక లక్ష్యాలకు భారత్ మరింత చేరువైంది’ అని పేర్కొన్నారు.

News December 31, 2024

అవును సల్మాన్‌తో నా పెళ్లి ఆగిపోయింది: హీరోయిన్

image

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు నటి సంగీత బిజిలానీకి పెళ్లంటూ ఒకప్పుడు బీ టౌన్‌లో బాగా ప్రచారం జరిగింది. అది నిజమేనని సంగీత ఓ ఇంటర్వ్యూలో తాజాగా అంగీకరించారు. తన పెళ్లి పత్రికల్ని పంచేవరకూ వచ్చి ఆగిపోయిందని సల్మాన్ కూడా గతంలో వెల్లడించారు. అయితే సంగీత పేరును ఆయన చెప్పలేదు. కాగా.. బాలీవుడ్‌లో సల్లూభాయ్‌ పలువురితో ప్రేమాయణం నడిపినా ఏదీ పెళ్లి పీటల వరకూ రాలేదని అక్కడి వారు అంటుంటారు.