News May 4, 2024

నిజ్జర్ హత్య.. ఆ ముగ్గురూ భారతీయులే?

image

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురూ భారతీయులని పేర్కొంటూ వారి ఫొటోలను రిలీజ్ చేసింది. నిందితులు కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28)గా పేర్కొంది. వీరికి భారత ప్రభుత్వానికి సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. కాగా నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉందని కెనడా ఆరోపిస్తోంది.

Similar News

News March 22, 2026

యుద్ధంతో పర్యావరణానికీ భారీ విధ్వంసం

image

పశ్చిమాసియాలో యుద్ధం పర్యావరణాన్నీ నాశనం చేస్తోంది. 2 వారాల్లో 5 మి. టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు(CO2, CH4, N20) విడుదలైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇరాన్‌లో 20K భవనాలు దెబ్బతినడంతో 2.4M టన్నుల CO2 రిలీజైంది. 2.5-5.9మి. బ్యారెళ్ల చమురు ధ్వంసమవడంతో 1.88M టన్నుల C02 గాల్లో కలిసింది. దేశాలు వాడిన ఇంధనం, కోల్పోయిన జెట్స్, డ్రోన్లు, క్షిపణుల వల్ల కూడా విష పదార్థాలు విడుదలయ్యాయి’ అని తెలిపింది.

News March 22, 2026

ఈ జిల్లాల్లో రేపు పిడుగులతో వర్షాలు!

image

AP: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, పోలవరం, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందంది. ఉరుములు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచించింది.

News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.